Kothagudem: దసరా పండుగ ప్రజల జీవితాల్లో నూతన విజయాలు నింపాలి..సాబీర్ పాషా!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా. ప్రజల్లో ఐకమత్యం విలసిల్లాలని ఆకాంక్ష.
Kothagudem: దసరా పండుగ ప్రజల జీవితాల్లో నూతన విజయాలు నింపాలి..సాబీర్ పాషా!
Kothagudem: ఈ దసరా ప్రజల జీవితాల్లో నూతన విజయాలు నింపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా ఆకాంక్షించారు. కొత్తగూడెంలో విజయదశమిని పురస్కరించుకుని ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై సాధించిన విజయానికి నిదర్శనంగా జరుపుకునేదే విజయదశమి పండుగ అని, ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో తులతూగాలని, ఐక్యమత్యంతో కలిసిమెలిసి ముందుకు సాగాలని కోరారు.




