Kothagudem: భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు సీతారామ జలాలు అందించాలి

Kothagudem: భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు సీతారామ కెనాల్ ద్వారా గోదావరి జలాలు అందించాలని కూనంనేని డిమాండ్.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 28 Aug 2026 4:24 PM IST
Kothagudem
X

Kothagudem: భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు సీతారామ జలాలు అందించాలి

కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు సీతారామ కెనాల్ ద్వారా గోదావరి జలాలను అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఆయన సిపిఐ రైతు సంఘం నాయకులతో కలిసి జూలూరు పాడు మండలంలోని వినోబా నగర్ గ్రామ సమీపంలోని రాజీవ్ లింకు కెనాల్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వారి నుంచి వివరాలను తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు తరలించడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, సీతారామ కెనాల్ నిర్మాణంతో భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల రైతులు భూములను కోల్పోయారని, అయినప్పటికీ ఈ ప్రాంత రైతులకు గోదావరి జలాలు అందకపోవటంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

రైతుల ఆందోళనను గమనించి సిపిఐ ఆధ్వర్యంలో నాయకుల బృందం రాజు లింకు కెనాల్ ను సందర్శించడం జరిగిందన్నారు. జూలూరుపాడు మండలంలోని కప్పల కుంట, శనగచెరువు, దండాల చెరువు లో గోదావరి జలాలను నింపి వాటి ద్వారా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

డిస్ట్రిబ్యూటరీ కాలవల నిర్మాణం పూర్తి అయ్యేసరికి మరో ఏడాది పడుతుందని, ప్రభుత్వం ఈ మూడు చెరువుల్లో నీటిని నిలిపి అక్కడినుంచి సింగభూపాలెం చెరువుకు గోదావరి జలాలను తరలించి రైతుల పంటలకు సాగునీరు అందించాలని కోరారు. అదేవిధంగా బూర్గంపాడు అశ్వరావుపేట ఇల్లందు, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని రైతులకు గోదావరి జలాలను అందించేందుకుగాను ప్రత్యేకంగా రెగ్యులేటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు ఆనాడు సాగునీటి కోసం కమ్యూనిస్టు పార్టీలు ఎంతగానో పోరాటం చేశాయని గుర్తు చేశారు.

రైతుల సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గోదావరి జలాలను అందించే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సబీర్ పాషా, కొత్తగూడెం మేయర్ మూడు గణేష్ సీతారామ ఈ ఈ మహేశ్వరరావు, డి ఈ చంద్రశేఖర్, ఏఈ శ్రావణి సుజాతనగర్ ఎంపీడీవో భారతి, సీపీఐ వైరా నియోజకవర్గ కన్వీనర్ ఎర్ర బాబు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శియాస రోశయ్య, యలంకి మధు sk నాగులుమీరా తాత నరసింహారావు చెరుకుమల్ల రాజేశ్వరరావు ఊడల సుధా తదితర రైతాంగం పాల్గొన్నారు

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story