Kothagudem: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై బగ్గుమన్న ప్రజా సంఘాలు

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, టీయూసీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 May 2026 4:14 PM IST
Kothagudem
X

Kothagudem: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై బగ్గుమన్న ప్రజా సంఘాలు

కొత్తగూడెం: జిల్లా పార్టీ కార్యాలయం నుండి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఆటో ట్రాలీకి తాడు కట్టి లాగి నిరసన తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగాCPIML మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం. డివిజన్ కార్యదర్శి జాటోత్ కృష్ణ TUCI జిల్లా సహాయ కార్యదర్శి పెద్ద బోయిన సతీష్. ఉపాధ్యక్షుడు గోపాలరావు లు మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మే 15ఉదయం 6 గంటలకు సామాన్యుడు నిద్రలేచేసరికి భారీగా పెట్రోల్, డీజిల్ పై,, 3.. రూపాయలు పెంచి అమల్లోకి తెచ్చి వాహనదారులకు భారీ షాక్ ఇచ్చినది.

ఆయిల్ కంపెనీలు పశ్చిమాసియా యుద్ధం సంక్షోభం నేపథ్యం.. హార్మోజ్ జల సంధి మూసివేత కారణాలు చెబుతున్నప్పటికీ,, 2014లో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చేనాటికి లీటరు పెట్రోలు 70 రూపాయలు ఉండగా.. 2026 నాటికి 114 రూపాయలకు,, డీజిల్ 60 రూపాయలు ఉండగా.. 98 రూపాయలకు పెంచి,, ఈ 12 సంవత్సరాల కాలంలో 25.30 కోట్ల రూపాయలు భారత దేశ ప్రజలపై భారం వేసింది. 145 కోట్ల ప్రజలపై, వ్యవసాయ రంగం, రవాణా, తదితర రంగాలపై ఆర్థిక భారం మోపి నిత్యావసర ధరలు మరింత పెరగడానికి దోహదం చేసి సామాన్యుడి జీవితం ఖరీదుగా మారిన పరిస్థితి. యుద్ధం రాక మునుపు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్.

రష్యా వద్ద ముడిచమురు కొనవద్దని నిర్బంధ ఆంక్షలు వేసి, దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగేటట్లు వ్యవహరించిన ట్రంప్ పై..మోడీ మౌనం దేనికి సంకేతాలు అర్థం చేసుకోవాలి. ట్రంప్ నిర్బంధ ఆదేశాలతో చమురు దిగుమతి వలన భారత దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి.. ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపి.. రానున్న కాలంలో పాకిస్తాన్ లాంటి ఆర్థిక పరిస్థితి రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

దీని వలన నిత్యావసర ధరలు మరింత పెరగడానికి దోహదపడతాయి .. , నరేంద్ర మోడీ వేసిన పన్నుల భారాన్ని రద్దు చేయాలని, ప్రజలంతా వ్యతిరేకించాలని , . పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఉద్యమాలను ఉద్రుక్తం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు వైగోపాలరావు. TUCI జిల్లా సహాయ కార్యదర్శి పి సతీష్.ఎం రాజశేఖర్. బైరి వెంకన్న. శీను. పిఓడబ్ల్యూ నాయకురాలు జ్యోతి. నరసింహారావు. మంగమ్మ.తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story