Kothagudem: కొత్తగూడెం కోర్టులో పర్యావరణ దినోత్సవం
Kothagudem: కొత్తగూడెంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం.
Kothagudem: కొత్తగూడెం కోర్టులో పర్యావరణ దినోత్సవం
కొత్తగూడెం: కొత్తగూడెంలో జిల్లా లీగల్ సెల్ అథారిటీ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకుర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలని, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
అనంతరం కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి ప్రేమలత, అటవీశాఖ కిన్నెరసాని FDO బాబురావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ప్రేమలత మాట్లాడుతూ .. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి అని, పంచభూతాలనే ప్రకృతి అంటారని వివరించారు. పంచభూతాలను రక్షించుకుంటే మనల్ని మనం రక్షించుకున్నట్లే అని తెలిపారు. పంచభూతాలను సక్రమంగా వినియోగించుకుని, భావితరాలకు ఉపయోగపడే విధంగా మన వంతుగా కృషి చేద్దామని సూచించారు.
ప్రకృతిని మనం పూజించాలన్నారు. మనం నేడు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నామని, అందుకు కారణం మనం ప్రకృతిని, పంచభూతాలను నిర్లక్ష్యం చేయబట్టే సంభవిస్తున్నాయన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరు డబ్బుకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నామో ప్రకృతికి, పంచభూతాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి వాటి సంరక్షణ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.




