Kothagudem: లాడ్జిల యజమానులకు ఎస్పీ రోహిత్ రాజు కీలక సూచనలు: అసాంఘిక కార్యకలాపాలకు తావుంటే కఠిన చర్యలు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలులో లాడ్జిల యజమానులతో సమావేశమయ్యారు.

M RAVIKIRAN
Published on: 9 May 2026 7:13 PM IST
Kothagudem
X

Kothagudem: లాడ్జిల యజమానులకు ఎస్పీ రోహిత్ రాజు కీలక సూచనలు: అసాంఘిక కార్యకలాపాలకు తావుంటే కఠిన చర్యలు!

కొత్తగూడెం: జిల్లాలో లాడ్జిలను నడిపించే యజమానులు నేరచేదనలో,నేరాలను నియంత్రించడంలో పోలీసు వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలులో లాడ్జిల నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎస్పీ వారికి పలు సూచనలను చేశారు. లాడ్జిలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఖచ్చితమైన నియమ నిబంధనలను పాటిస్తూ సామాజిక బాధ్యతను కలిగి ఉండి పోలీసు వారికి సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా లాడ్జీ యాజమాన్యాలకు పలు సూచనలను చేశారు.

లాడ్జిల యాజమాన్యాలు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు

ప్రతి అతిధి నుండి ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన ఎదో ఒక గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ & డ్రైవింగ్ లైసెన్స్) తీసుకోవాలి.

లాడ్జీలో చేరే వారి పేరు,పూర్తి చిరునామా,ఫోన్ నంబర్,వచ్చిన సమయం మరియు వెళ్ళే సమయాన్ని రిజిస్టర్లో స్పష్టంగా నమోదు చేయాలి.గదుల్లో ఉన్న వారిని కలపడానికి వచ్చే విజిటర్లను నేరుగా లోపలికి పంపకూడదు.రిసెప్షన్ వద్ద వారి వివరములు,ఫోన్ నంబర్ నమోదు చేసుకున్న తర్వాత వంపాలి.

విదేశీయులు ఎవరైనా లాడ్జిలో స్టే చేస్తే,వారి వివరములు 24 గంటల లోపు ఆన్లైన్ ద్వారా (Form-C) రూపంలో పోలీసులకు సమర్పించాలి.

ప్రతిరోజు ఉదయం 6.00 గంటలకు రిజిస్టర్లోని సమాచారము,గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలను సంబందిత పోలీస్ స్టేషన్లో సమర్పించాలి.

ఎంట్రన్స్,రిసెప్షన్ మరియు కారిడార్,బయటవైపు రోడ్డు కనిపించే విధంగా,రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా పని చేసే స్థితిలో ఉన్న CCTV కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.వీటి ఫుటేజిని కనీసం 30 రోజుల వరకు భద్రపరచాలి.

అనుమానాస్పదంగా అనిపించే లగేజిని తనిఖీ చేయాలి.అధిక మొత్తంలో బ్యాగులు లేదా అనుమానిత వస్తువులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా లేదా తప్పుడు వివరాలు ఇస్తున్నారని అనిపించినా,లాడ్జి గదుల్లో మద్యం సేవించడం, జూదం ఆడటం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా. అపరిచిత వ్యక్తులు గ్రూపులుగా వచ్చి బస చేసినా వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కి లేదా డయల్ 100కు సమాచారం అందించాలి.

స్థానిక పోలీస్ స్టేషన్ మరియు SHO నంబర్లను ఎల్లప్పుడూ రిసెప్షన్ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి.పోలీసులు ఎవరైనా నిందితుల కోసం గాలిస్తున్నపుడు, వారికి సహకరించాలి.

ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి మరియు మంటను అదుపు చేసే వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి.అత్యవసర ఎగ్జిట్ ను కలిగి ఉండాలి.

రిసెప్షన్ డెస్క్ క్రింద అత్యవసర అలారం ఏర్పాటుచేసుకోవాలి.ఏదైనా ప్రమాదం లేదా గొడవ జరిగినప్పుడు దాన్ని నొక్కితే వెంటనే అలారం మోగేలా లేదా దగ్గరలోని పోలీస్ స్టేషనుకు సమాచారం వెళ్ళేలా ఉండాలి.

సిబ్బంది యొక్క వివరములు,వారి పూర్వాపరాలను పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవడం మంచిది. లాడ్జిలో సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటే,వారు గుర్తింపు పొందిన ఏదైనా సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వారై ఉండాలి.వారి వెరిఫికేషన్ తప్పనిసరిగా చేసి ఉండాలి.

ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే,చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా,లాడ్జి లైసెన్సు రద్దు చేయబడుతుంది.

M RAVIKIRAN

M RAVIKIRAN

Next Story