Kothagudem: పొలంలో మంటలు పెట్టిన రైతు.. పంచాయతీ వర్కర్ ఇల్లు పూర్తిగా దగ్ధం

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 20 May 2026 7:54 PM IST
Kothagudem
X

Kothagudem: పొలంలో మంటలు పెట్టిన రైతు.. పంచాయతీ వర్కర్ ఇల్లు పూర్తిగా దగ్ధం

Kothagudem: గ్రామ సమీప పొలంలో వ్యర్ధాలు తగలబెట్టేందుకు మంటలు పెట్టిన రైతు. గాలికి ఎగిసి పడిన మంటలు సమీపంలోని గుడిసె పై పడటంతో పంచాయతీ వర్కర్ గా పని చేస్తున్న పాయం సతీష్ గుడిసె ఇల్లు పూర్తిగా దగ్దం. అగ్ని ప్ర‌మాదంలో సుమారు రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిన‌ట్లు స‌మాచారం. లోతు వాగు గ్రామ పంచాయతీ మాదిగ ప్రోలులో స్థానిక రైతు తన పొలంలోని వ్య‌ర్థాల‌కు నిప్పు పెట్టగా, గాలికి నిప్పు రవ్వలు ఎగిరి వచ్చి అశోక్ నగర్ గ్రామ పంచాయతీ వర్కర్ గా పని చేస్తున్న పాయం సతీశ్‌ గుడిసె ఇంటిపై పడడంతో గుడిసె ఇల్లు మొత్తం కాలిపోయింది.

విషయం తెలుసుకున్న లోతువాగు సర్పంచ్, ఉప సర్పంచ్ వెంటనే అక్కడికి చేరుకొని చుట్టుపక్కల నివాసాలకు మంటలు వ్యాప్తి చెందకుండా పంచాయతీ ట్యాంకర్ తో నీటిని కొట్టి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై సర్పంచ్ ఈసం కళ్యాణి, లక్ష్మీదేవి పల్లి తహసిల్దార్ కు, ఎస్సై కు సమాచారం అందించారు. బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందే విధంగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ..లోతువాగు పంచాయతీ.. మాదిగ ప్రోలు గ్రామంలోని గడ్డి గుడిసెలో నివసిస్తుంటామని తెలిపారు.. తమ ఇంటి సమీపంలోని పత్తి చేలో రైతు మంట పెట్టారని, గాలికి మంటలు ఎగిసి పడి వచ్చి గడ్డి ఇంటి మీద పడ్డాయని తెలిపారు.

ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో నిల్వ చేసి ఉన్న నలభై బస్తాల వడ్లు, మూడు వ్యవసాయ మోటార్లు,బైకు, వంట సామాగ్రి మొత్తం కాలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన గ్రామాన్ని సందర్శించి, బాధితులను ఓదార్చిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story