Kothagudem: జంతువుల ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నకిరేపేట సమీపంలో అడవి జంతువుల కోసం వేసిన కరెంట్ ఉచ్చుకు చిక్కుకుని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందారు.
Kothagudem: జంతువుల ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరేపేట సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చినట్లు భావిస్తున్న కరెంట్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ అధికారి మృతి చెందినట్లు సమాచారం. చెరువు సింగారం వెస్ట్ బీట్‌కు చెందిన ఎఫ్‌బీఓ నవీన్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
కరెంట్ ఉచ్చుకు గురైన ఆయనను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కరెంట్ ఉచ్చును ఎవరు ఏర్పాటు చేశారు? ఏ ప్రాంతంలో, ఏ పరిస్థితుల్లో అధికారి దానికి గురయ్యారు? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




