Burgampadu: 80 మంది సేంద్రియ రైతులకు ఉచితంగా గోవుల పంపిణీ
Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 15 మండలాల నుంచి 80 మంది రైతులకు ఉచితంగా గోవులను పంపిణీ చేశారు.
Burgampadu: 80 మంది సేంద్రియ రైతులకు ఉచితంగా గోవుల పంపిణీ
బూర్గంపాడు: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు అండగా నిలిచేందుకు అన్నపూర్ణ గోసంరక్షణ కేంద్రం పాల్వంచ ముందడుగు వేసింది. కేవీకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి సలహాలు, సూచనల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 15 మండలాలకు చెందిన 80 మంది సేంద్రియ వ్యవసాయ రైతులకు ఒక్కొక్కరికి ఒక్క గోవు చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు.
ఉత్తమ రైతు గాదె నర్సిరెడ్డి ఆధ్వర్యంలో, అన్నపూర్ణ గోసంరక్షణ కేంద్ర నిర్వాహకులు ఆంజనేయ శర్మ సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయంలో గోవుల పాత్ర ఎంతో కీలకమని, గోమూత్రం, పేడ ద్వారా సహజ ఎరువులు, జీవామృతం తయారు చేసుకుని భూమి సారాన్ని పెంపొందించుకోవచ్చని ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ప్రోత్సాహం అందించారు.
రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి ఆధారిత వ్యవసాయం వైపు రైతులను నడిపించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఒక గోవు ద్వారా రైతుకు వ్యవసాయంలో ఎన్నో ప్రయోజనాలు కలగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 15 మండలాలకు చెందిన 80 మంది రైతులకు ఉచితంగా గోవులను అందించడం పట్ల పలువురు రైతు సోదరులు హర్షం వ్యక్తం చేశారు.రైతు సంక్షేమం.. గోసంరక్షణ.. ప్రకృతి వ్యవసాయం అనే లక్ష్యాలతో సాగిన ఈ కార్యక్రమం సేంద్రియ వ్యవసాయానికి కొత్త ఉత్సాహాన్ని అందించింది.




