Kothagudem: సింగరేణి కార్మికుని కుమార్తెకు డాక్టరేట్ గవర్నర్ చేతుల మీదుగా పట్టా!
Kothagudem: నెహ్రూబస్తీకి చెందిన సంధ్యాల హైమావతి ఉస్మానియా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసి, గవర్నర్ శివప్రసాద్ శుక్ల చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
Kothagudem: సింగరేణి కార్మికుని కుమార్తెకు డాక్టరేట్ గవర్నర్ చేతుల మీదుగా పట్టా!
Kothagudem: సింగరేణి కార్మిక కుటుంబం నుంచి వచ్చిన సంధ్యాల హైమావతి ఉన్నత విద్యలో ప్రతిభ చాటుకుని డాక్టరేట్ పట్టా సాధించారు. కొత్తగూడెం పట్టణంలోని నెహ్రూబస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు సంధ్యాల కొమరయ్య, శంకరమ్మ దంపతుల కుమార్తె హైమావతి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో ఇటీవల నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్ శివప్రసాద్ శుక్ల చేతుల మీదుగా హైమావతి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
రసాయన శాస్త్ర విభాగంలో డాక్టర్ ఆలియా మేడం పర్యవేక్షణలో “డాకింగ్ స్టడీస్ అండ్ టెట్రాజోల్ డెరివేటివ్స్” అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు. పేదరికం, సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ పట్టుదలతో చదువును కొనసాగించి ఉన్నత విద్యలో రాణించడం ద్వారా హైమావతి స్ఫూర్తిగా నిలిచారు.
తమ కుమార్తె డాక్టరేట్ పట్టా సాధించడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగూడెం పట్టణానికి మంచి పేరు తీసుకురావడం పట్ల పట్టణ ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హైమావతికి అభినందనలు తెలిపారు.




