Kothagudem: చుంచుపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపూర్ణిమ
Kothagudem: విద్యానగర్ సాయిబాబా మందిరంలో వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. 108 కలశాలు, పంచామృతాలతో బాబాకు విశేష అభిషేకాలు, నారాయణ సేవ (అన్నదానం).
Kothagudem: చుంచుపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపూర్ణిమ
కొత్తగూడెం: కొత్తగూడెం.. చుంచుపల్లి గ్రామపంచాయతీ, విద్యానగర్ కాలనీలో వేంచేసియున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు. 108 కళాశాలు, పండ్ల పంచామృతాలు పండ్ల రసాలతో సాయిబాబాకు అభిషేకాలు.. విశేష పూజలు నిర్వహించారు.
గురుపూర్ణిమ వేడుకల సందర్భంగా ఆలయ పూజారులు. మురళీ కృష్ణమాచార్యులు వంశీకృష్ణమాచార్యులు గత మూడు రోజులుగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం రోజున విశేషించి పాదుకల పూజ, గణపతి పూజ నిర్వహించారు, మంగళవారం రోజున అభిషేకం, బిల్వపత్రార్చన, జ్యోతిర్లింగార్చన, సాయి వ్రతార్చన అత్యంత, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
బుధవారం రోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ మహోత్సవం సందర్భంగా ఉదయం నుండే మహిళా భక్తులు ఆలయానికి పోటెత్తారు. అష్టోత్తర 108 కళాశాలతో అభిషేకం నిర్వహించారు. సాయిబాబాకు విశేష అలంకరణ చేశారు. తీర్థప్రసాదాల వితరణ అనంతరం నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నారాయణ సేవ అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు గురు పూర్ణిమ వేడుకల సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆలయ కమిటీ సభ్యులు పరుచూరి కృష్ణమోహన్ సుబ్బారావు, ఈదర నాగేశ్వరరావు, చిగురుపాటి శ్రీనివాస్, ముక్కామల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.




