Kothagudem: కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ శిక్షణ కార్యక్రమం విజయవంతం
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా ముగిసిన ఐఎఫ్‌ఎంఐఎస్ శిక్షణ. 450 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాంక్షన్ మాడ్యూల్స్‌పై అవగాహన.
Kothagudem: కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ శిక్షణ కార్యక్రమం విజయవంతం
కొత్తగూడెం: ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ ఆర్థిక పరిపాలనను మరింత సమర్థవంతంగా అమలు చేసే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన IFMIS జిల్లా స్థాయి కాస్కేడింగ్ శిక్షణ కార్యక్రమం విజయవంతమైంది. గురువారం కొత్తగూడెంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 450 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన సర్క్యులర్ మెమో ప్రకారం నిర్వహించిన ఈ శిక్షణలో IFMIS పరిధిలోని e-HRMS (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్), e-Sanction మాడ్యూల్స్‌పై అవగాహన కల్పించారు. ఆయా మాడ్యూల్స్ వినియోగ విధానాలు, ఆన్‌లైన్ ప్రక్రియలు, కార్యాచరణ పద్ధతులను ప్రాక్టికల్ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా వివరించారు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపొందించడం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం, డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
జిల్లా ఖజానా అధికారి జక్కా మీనాక్షి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, ఖజానా శాఖ అధికారులు సైదులు, పి. శ్రీనివాస్, బి. శారద, అక్బర్ పాషా సమన్వయంతో వ్యవహరించారు. ప్రోగ్రామ్ డెమాన్‌స్ట్రేటర్లుగా జి. హరీష్, కె. రష్మి తేజస్వి, అరుణ్ పాల్గొని శిక్షణ అందించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, ఉద్యోగులకు జిల్లా ఖజానా శాఖ కృతజ్ఞతలు తెలిపింది. డిజిటల్ తెలంగాణ దిశగా పారదర్శకమైన, సమర్థవంతమైన ఆర్థిక పరిపాలన కోసం కృషి కొనసాగుతుందని పేర్కొంది.




