Kothagudem: కొత్తగూడెంలో మెడికల్ షాపుల బంద్.. ఈ-ఫార్మసీలపై నిరసన

Kothagudem: ఆన్‌లైన్ మందుల విక్రయాల జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా మెడికల్ షాపులు 24 గంటల పాటు బంద్ అయ్యాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 20 May 2026 5:06 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో మెడికల్ షాపుల బంద్.. ఈ-ఫార్మసీలపై నిరసన

Kothagudem: కొత్తగూడెం జిల్లాలో AIOCD,TTCDA పిలుపులో భాగంగా కొత్తగూడెం పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స అసోసియేషన్ ఆథ్వర్యంలో ఆన్ లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల 24 గంటల బంద్ చేపట్టారు. దీంతో కొత్తగూడెం పట్టణంలోని 149 మెడికల్ షాప్ లతో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా 1200 మెడికల్ షాపులు 24 గంటల పాటు బంద్ అయ్యాయి.

అత్యవసర పరిస్థితి నేపథ్యంలో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో నిరసన సభ ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ మందుల విక్రయాలు, డోర్ డెలివరీ సిస్టం కు సంబంధించిన ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కంభంపాటి రవి, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు పెమ్మసాని అనిల్ పాల్గొని ప్రసంగించారు.

ఆన్లైన్ విక్రయాల వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా ఉందన్నారు. ఆన్లైన్ విక్రయాలను వ్యతిరేకంగా చేపట్టిన ఒకరోజు మెడికల్ షాపుల బందుకు ప్రజలు సహకరించాలని, ఎమర్జెన్సీ మందులు అందజేసేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం 2018లో జిఎస్ఆర్ 817 నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ మందులు విక్రయాలకు అవకాశం కల్పించిందని దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

2020లో జీఎస్ఆర్ ౨౨౦యే ఈ ద్వారా మందుల డోర్ డెలివరీ సిస్టంను ప్రవేశపెట్టిందని విమర్శించారు. కార్పొరేటు వారికి మందులను సబ్సిడీపై ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారిలో కదలిక రాలేదని దీంతో తాము తప్పని సరి పరిస్థితిలో 24 గంటలు మెడికల్ షాప్ ల బందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ మెడిసిన్స్ విక్రయాలపై పర్యవేక్షణ ఉండదని,

స్ఫూరియస్ డ్రగ్స్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని, దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో స్ఫూరియస్ డ్రగ్స్ సరఫరా కారణంగా పలు కేసులు కూడా నమోదైనట్లు తెలిపారు. ప్రజా ఆరోగ్యానికి విఘాతం కలిగించే ఆన్లైన్ మందుల విక్రయాలను నిరోధించాలని డిమాండ్ చేశారు. ఒకరోజు మెడికల్ షాప్ బంద్ కు మద్దతుగా,సంఘీభావం తెలుపుతూ కొత్తగూడెం పట్టణంలో కార్పొరేట్ మెడికల్ షాపులు సైతం బంద్ చశారు.

మెడికల్ షాపుల బంద్ కు తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్, తెలంగాణ కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్, కొత్తగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి గోపాల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అగర్వాల్, గుత్తా నవీన్, చావా జగదీష్, పూర్ణ, సలీం, రామారావు, బాబు, సత్యనారాయణ, రవి, లక్ష్మణ్, సిరాజ్, దావూద్, రమేష్, శ్రీధర్, జాని, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story