Kothagudem: NCST సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు ఘన స్వాగతం పలికిన కలెక్టర్ అంకిత్

Kothagudem: కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్‌కు సింగరేణి గెస్ట్ హౌస్‌లో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 24 Aug 2026 2:29 PM IST
Kothagudem
X

Kothagudem: NCST సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు ఘన స్వాగతం పలికిన కలెక్టర్ అంకిత్

కొత్తగూడెం: జిల్లా పర్యటనకు విచ్చేసిన నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (NCST) గౌరవ సభ్యులు జాతోత్‌ హుస్సేన్‌కు సింగరేణి గెస్ట్‌ హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ పూల మొక్కను అందించి గౌరవ సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు.

జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, గిరిజనులకు మెరుగైన మౌలిక వసతులు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అందిస్తున్న సేవలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్‌, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌ సింగ్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story