Palwancha: ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

Palwancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సిద్ధార్థ హైస్కూల్‌లో జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 14 Nov 2026 9:10 PM IST
Palwancha
X

Palwancha: ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భువన సుందర రెడ్డి, నూకల రంగారావు ఆధ్వర్యంలో సిద్ధార్థ హైస్కూల్ లో జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెహ్రూ చిన్నారులను ఎంతో ప్రేమించేవారని, అందుకే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. దేశ నిర్మాణంలో నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారికి మంచి విద్య, సంస్కారం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కొత్వాల శ్రీనివాసరావు, బాలు నాయక్, చీకటి కార్తీక్, గద్దల రమేష్, సాదం రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN