Kothagudem: కొత్తగూడెంలో NSUI వినూత్న నిరసన: రాజకీయ రావణ దహనం
Kothagudem: దసరా వేళ కొత్తగూడెంలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రతిరూపాలతో రాజకీయ రావణాసురుడిని దహనం చేసి నిరసన తెలిపారు.
Kothagudem: కొత్తగూడెంలో NSUI వినూత్న నిరసన: రాజకీయ రావణ దహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దసరా వేడుకల సందర్భంగా కొత్తగూడెంలో ఎన్ఎస్యూఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ రావణాసురుడి ప్రతిరూపాన్ని రూపొందించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
కొత్తగూడెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రతిరూపాలతో రావణాసురుడి ఆకారాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దాని పరిరక్షణే తమ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ నయీమ్, నిఖిల్, మోయిన్, సమీర్, విక్రమ్, తరుణ్, మహేష్, ఆసిఫ్, నగేష్, అమ్ము, హర్షద్, షాహిద్, సంపత్ తదితర ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొన్నారు.




