Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు!

Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. కేక్ కట్ చేసి అన్నదానం ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 Oct 2026 5:35 PM IST
Kothagudem
X

Kothagudem: లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు!

Kothagudem: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను లక్ష్మీదేవిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరగట్ల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం ముందుండే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఆళ్ల మురళి, ఉకంటి గోపాలరావు, జేవీఎస్ చౌదరి, నాగేంద్ర త్రివేది, పెదబాబు, వై. శ్రీనివాసరెడ్డి, అకునూరి కనకరాజు, వడ్డెం సతీష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అలాగే పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM