Kothagudem: కొత్తగూడెం రాజేష్‌కు దాశరథి-సినారె గజల్ పురస్కారం!

Kothagudem: యువ గజల్ కవి కొత్తగూడెం రాజేష్‌కు గుంటూరులో ప్రతిష్టాత్మక ‘దాశరథి - సినారె తెలుగు గజల్ పురస్కారం’ అందజేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 15 Oct 2026 2:49 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం రాజేష్‌కు దాశరథి-సినారె గజల్ పురస్కారం!

కొత్తగూడెం: యువ గజల్ కవి, కొత్తగూడెం పట్టణానికి చెందిన కొత్తగూడెం రాజేష్ కు ప్రతిష్టాత్మక "దాశరథి - సినారె తెలుగు గజల్ పురస్కారం" దక్కింది. నిన్న గుంటూరులో జరిగిన మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ గారి 40 వసంతాల గజల్ గాన వేడుకలు, 60 వసంతాల తెలుగు గజల్ కు నీరాజన ఉత్సవాల సందర్భంగా ఈ పురస్కారం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ బి. కృష్ణ మోహన్, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షకులు, శాసనసభ సభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్, మాస్ట్రో డా. గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా కొత్తగూడెం రాజేష్ ఈ పురస్కారాన్ని అందుకుని ఘనంగా సన్మానించబడ్డారు.

ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ విక్రమ్ పూల, తెలుగు సంస్కృత సంస్థ అధ్యక్షులు శ్రీ విల్సన్ శరత్ చంద్ర, నాటకరంగ అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM