Kothagudem: రాఘవాపురంలో భూ రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో మధు
Kothagudem: భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురంలో భూ రీసర్వే పనులను కొత్తగూడెం ఆర్డీవో డి. మధు, తహసీల్దార్ కృష్ణప్రసాద్‌తో కలిసి పరిశీలించి రైతుల సమస్యలపై ఆరా తీశారు.
Kothagudem: రాఘవాపురంలో భూ రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీవో మధు
కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే పనులను ఆర్డీవో డి.మధు స్థానిక తహసీల్దార్ కృష్ణప్రసాద్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రీసర్వే ప్రక్రియ జరుగుతున్న తీరును, సర్వే సిబ్బంది చేపడుతున్న పనులను ఆర్డీవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గ్రామంలోని రైతులతో మాట్లాడి రీసర్వే సందర్భంగా వారికి ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భూములకు సంబంధించిన వివరాలు, సర్వే ప్రక్రియపై రైతుల అభిప్రాయాలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణప్రసాద్, సర్వే సిబ్బంది, స్థానిక ప్రజలు, రైతులు పాల్గొన్నారు.




