Kothagudem: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతికి కొత్తగూడెం డిపోలో నివాళి!

Kothagudem: చిల్లర వివాదంలో గాయపడి మృతి చెందిన మణుగూరు ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు కొత్తగూడెం డిపోలో ఘన నివాళి. సిబ్బంది సంతాపం, కుటుంబానికి సానుభూతి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 4 Nov 2026 12:47 PM IST
Kothagudem
X

Kothagudem: మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గుండ్ల ప్రవళిక మృతి, గత నెల 25వ తేదీన ప్రయాణికురాలితో చిల్లర విషయంలో వివాదం నేపథ్యంలో ప్రయాణికురాలు నెట్టి వేయడంతో బస్సు కింద పడి గాయాలపాలైన ప్రవళిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవళిక మృతి.

ఆమె మృతిపట్ల కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో ప్రవళిక చిత్రపటానికి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మితో పాటు ఆర్టీసీ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సిబ్బంది.

డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ - కండక్టర్ ప్రవళిక పట్ల జరిగిన ఘటన దురదృష్టకరమని, గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని విచారం వ్యక్తం చేశారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు - కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM