Kothagudem: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 'జెన్-జెడ్' సెమినార్ నిర్వహణ
Kothagudem: కొత్తగూడెంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 'జెన్-జెడ్' సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Kothagudem: ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 'జెన్-జెడ్' సెమినార్ నిర్వహణ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘Gen-Z సెమినార్’ కార్యక్రమానికి SFI అఖిల భారత సహాయ కార్యదర్శి పి.సి. ఘోష్, జేఎన్‌యూ విద్యార్థి సంఘం పూర్వ అధ్యక్షురాలు తదితరులు హాజరయ్యారు. యువత ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి, సామాజిక అంశాలపై విద్యార్థులతో చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ.. ప్రస్తుత తరం విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థి దశలోనే ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని, తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం వారు కొత్తగూడెంలోని సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయాన్ని సందర్శించి పార్టీ ముఖ్య నాయకులు, SFI నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమాల ప్రస్తుత పరిస్థితి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, యువతలో సామాజిక చైతన్యం పెంపొందించాల్సిన అవసరం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
తదుపరి మీడియాతో మాట్లాడిన SFI నాయకులు.. విద్యార్థుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. Gen-Z సెమినార్ ద్వారా యువతలో చైతన్యం, ఆలోచనా శక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.




