Kothagudem: మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ ఆర్థిక సాయం
Kothagudem: కొత్తగూడెం జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ హరి గోపాల్ కుటుంబానికి ఎస్పీ రోహిత్ రాజు లక్ష రూపాయల చెక్కును అందజేసి భరోసా కల్పించారు.
Kothagudem: మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ ఆర్థిక సాయం
కొత్తగూడెం: జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వరస్తూ అనారోగ్యంతో ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ హరి గోపాల్ కుటుంబానికి బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో చెక్కు రూపంలో 1,00,000/-(లక్ష రూపాయల) నగదును అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
మరణించిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ప్రభుత్వం తరఫున మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.




