Kothagudem: లోతువాగు రైల్వే బ్రిడ్జి మరమ్మత్తు పనులు పరిశీలించిన ఎస్పీ

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోతువాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) మరమ్మత్తు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 19 Jun 2026 8:59 PM IST
Kothagudem
X

Kothagudem: లోతువాగు రైల్వే బ్రిడ్జి మరమ్మత్తు పనులు పరిశీలించిన ఎస్పీ

Kothagudem: ఇల్లందు క్రాస్ రోడ్ నుండి బొమ్మనపల్లి క్రాస్ రోడ్ మధ్యన గల లోతు వాగు గ్రామం వద్ద జాతీయ రహదారి (NH -930P) పైన గల బ్రిడ్జ్ మరమ్మత్తు పనుల నేపథ్యంలో శుక్రవారం నాడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇల్లందు క్రాస్ రోడ్, బొమ్మనపల్లి క్రాస్ రోడ్, లోతు వాగు బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లను నిశితంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

ట్రాఫిక్ మల్లింపు వల్ల స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, మల్లింపు పాయింట్ల వద్ద స్పష్టమైన సూచిక బోర్డులతో పాటు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి సమయాలలో రిఫ్లెక్టివ్ జాకెట్స్ ధరించి ట్రాఫిక్ మళ్లింపు చేయాలని సూచించారు.

పనులను వేగంగా పూర్తి అయ్యేలా చూస్తూనే, ట్రాఫిక్ జామ్ కాకుండా స్థానిక ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మరమ్మత్తులు పూర్తి అయ్యేంతవరకు అధికారులు అందరు సమన్వయంతో పనిచేస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్, లక్ష్మీదేవిపల్లి ఎస్సై అఖిల, రైల్వే అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story