Kothagudem: హేమచంద్రపురం పోలీస్ హెచ్‌క్యూలో ఆయుధ పూజ ఎస్పీ రోహిత్ రాజు
Kothagudem: హేమచంద్రపురం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు నిర్వహించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. సిబ్బందితో కలిసి అన్నదానంలో భాగస్వామ్యం.
Kothagudem: హేమచంద్రపురం పోలీస్ హెచ్‌క్యూలో ఆయుధ పూజ ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం: దుర్గామాత నవరాత్రుల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజ కార్యక్రమాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీస్ శాఖ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను ప్రత్యేకంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, అప్రమత్తత పాటిస్తూ ఆయుధాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం పోలీస్ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు అత్యవసర సమయాల్లో ప్రజలకు తక్షణ సేవలు అందించడంలో పోలీస్ వాహనాలు కీలకమని తెలిపారు. వాహనాలను ఎప్పటికప్పుడు సక్రమమైన స్థితిలో ఉంచుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
వేడుకల సందర్భంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి అన్నప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు, ఆర్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




