Kothagudem: పోలీసు సోషల్ మీడియా హ్యాండ్లర్లపై ఎస్పీ సమీక్ష

Kothagudem: సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులపై నిఘా ఉంచాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Sept 2026 11:46 PM IST
Kothagudem
X

Kothagudem: పోలీసు సోషల్ మీడియా హ్యాండ్లర్లపై ఎస్పీ సమీక్ష

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న కార్యకలాపాల గురించి వాటిని పర్యవేక్షిస్తున్న సంబంధిత పోలీసు అధికారులతో ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సమీక్షించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేసే హ్యాండ్లర్లు వారు ప్రచారం చేస్తున్న పోస్టులు వీడియోలు సందేశాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో రాజకీయ మతపరమైన, కమ్యూనల్ అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు వీడియోలు, సందేశాలు ప్రచారం చేసే వారిపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తారని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లేదా ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న పోస్టులను గుర్తించి, వాటిని తొలగించే చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

అలాంటి పోస్టులు చేసే వ్యక్తులతో పాటు వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే హ్యాండ్లర్లపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని, నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయడం.

ప్రజలను రెచ్చగొట్టే పోస్టులను షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస్, ఎస్సై చంద్రశేఖర్ , పోలీసు శాఖ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story