Kothagudem: జిల్లాలో 68 స్కూళ్లు ఉత్తీర్ణత.. సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 10వ తరగతి ఫలితాల్లో 90.58 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కలెక్టర్ అంకిత్ వెల్లడించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 30 April 2026 12:42 PM IST
Kothagudem
X

Kothagudem: జిల్లాలో 68 స్కూళ్లు ఉత్తీర్ణత.. సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే

Kothagudem: 10 వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో భద్రాద్రి జిల్లా 90.58 శాతం ఫలితాలు సాధించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ 12,703 విద్యార్థులు హాజరవగా ..11,506 మంది ఉత్తీర్ణత

సాధించారు.జిల్లాలో ఉత్తీర్ణత 90.58% కాగా ఇందులో బాలురు 6192 గాను 5502 మంది ఉత్తీర్ణత సాంధించి 88.86% ,బాలికలు 6511 మందికి గాను 6004 మంది ఉత్తీర్ణత సాంధించి 92.21% గా వున్నారు.బాలుర కంటే బాలికలు 3.35% ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.

విద్యార్థులు రీకౌటింగ్, రీ వెరిఫికేషన్ కోసం 14.5. 2026 లోపు ఆయా ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాలి. ఫెయిల్ అయిన విద్యార్థులు ది.14.5.2026 లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా' వారు చదివిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు చెల్లించాలి.

50/- రూపాయల అపరాధ రుసుముతో సంబందించిన సబ్జెక్టు పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించవచ్చు..

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 05.06.2026 నుండి 12.06.2026 వరకు ప్రతీ రోజు ఉదయం 9.30 గం॥ నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు జరుగుతాయి. మొత్తం 302 పాఠశాలల నుండి విద్యార్ధులు హాజరుకాగా 68 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించినారు అందులో అన్నీ ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల నుండి 42, ప్రైవేట్ పాఠశాలల నుండి 26, 100% ఉత్తీర్ణత సాధించాయి. సున్నా ఫలితాలు జిల్లాలో లేవు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story