Kothagudem: మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన స్వర్ణదుర్గ అమ్మవారు

Kothagudem: కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర ఆలయంలో మహాలక్ష్మి అలంకారంలో శ్రీ స్వర్ణదుర్గ అమ్మవారి దివ్య దర్శనం. చండీ హోమం, నవావరణార్చనలతో భక్తుల హరిహరార్చనలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 Oct 2026 11:48 PM IST
Kothagudem
X

Kothagudem: మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన స్వర్ణదుర్గ అమ్మవారు

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వర్ణ దుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

శనివారం (17-10-2026) ఉదయం మంగళ వాద్యములు, తీర్థపు బిందె, నిత్యార్చనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పంచామృత స్నపనము, పీఠార్చన, అనుష్టానం, విశేష హోమము, చండీ హోమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన, మహాలక్ష్మి, దుర్గా, చండీ సప్తశతీ పారాయణం చేపట్టారు.

రాత్రి 8 గంటలకు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమన్నారాయణ అర్ధాంగి అయి, అష్ట కష్టాలను పారద్రోలి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే ధనదాయినిగా మహాలక్ష్మి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 10 గంటలకు మహా హారతి, ఆలయ బంధనంతో కార్యక్రమం ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM