Kothagudem: కొత్తగూడెంలో శ్రీ మహాకాళికా దేవి అలంకరణలో స్వర్ణ దుర్గమ్మ!
Kothagudem: కొత్తగూడెం విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వర్ణ దుర్గమ్మ శ్రీ మహాకాళికా దేవి అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు.
Kothagudem: కొత్తగూడెంలో శ్రీ మహాకాళికా దేవి అలంకరణలో స్వర్ణ దుర్గమ్మ!
Kothagudem: కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వర్ణ దుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం (అక్టోబర్ 19) అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
ఉదయం మంగళవాయిద్యాలు, తీర్థపు బిందె, నిత్యార్చనతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారికి పంచామృత స్నపనం, పీఠార్చన, విశేష హోమం, చండీ హోమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, మహాలక్ష్మి, దుర్గా, చండీ సప్తశతీ పారాయణం, పీఠపూజ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.
రాత్రి 8 గంటలకు శ్రీ స్వర్ణ దుర్గమ్మ *శ్రీ మహాకాళికా దేవి అలంకరణలో* భక్తులకు దర్శనమిచ్చారు. దుష్స్వప్నాలు, దుశ్శకునాలు, దుర్దోషాల నివారణతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించి, శత్రుబాధల నుంచి కాపాడే తల్లిగా మహాకాళికా దేవిని భక్తులు విశ్వసిస్తారు. రక్తబీజాసుర సంహారంతో ఆవిర్భవించిన దేవిగా అమ్మవారిని పూజిస్తారు.
రాత్రి 10 గంటలకు మహాహారతి అనంతరం ఆలయ బంధనం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు కాళీ బలి హరణం, ప్రాకార బలి హరణం, కుంభోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.




