Kothagudem: అశ్వారావుపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

Kothagudem: కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 29 Aug 2026 9:48 PM IST
Kothagudem
X

Kothagudem: అశ్వారావుపేటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం,వేదాంతపురంలో టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. గుట్టుచప్పుడు నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసి 9 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

పక్కా సమాచారంతో వేదాంతపురంలోని పేకాట స్థావరంపై విరుచుకుపడిన పోలీసులు, అక్కడే జూదం ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి రూ. 1,22,310 రొక్కంతో పాటు 2 కార్లు, 16 మోటార్ సైకిళ్లు, 16 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

దాడి సమయంలో పోలీసులను చూసి మరికొంతమంది అక్కడి నుంచి పరారయ్యారు. పారిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, పేకాట శిబిరాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA

Next Story