Kothagudem: పోలీసుల చాకచక్యం 4 నెలల క్రితం చోరీకైన మొబైల్ రికవరీ

Kothagudem: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోరీకి గురైన కొత్తగూడెం వాసి స్మార్ట్‌ఫోన్‌ను నల్లగొండలో గుర్తించి, రికవరీ చేసి బాధితుడికి అప్పగించిన సీఐ ఇంద్రసేనారెడ్డి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 28 May 2026 3:15 PM IST
Kothagudem
X

Kothagudem: పోలీసుల చాకచక్యం 4 నెలల క్రితం చోరీకైన మొబైల్ రికవరీ

కొత్తగూడెం: త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి ప్రగతి నగర్ కాలనీ కి చెందిన చంద్రగిరి నాగేశ్వరరావు అతని భార్య లక్ష్మి వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. కొత్తగూడెం తిరిగి వచ్చేందుకు మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కేందుకు ‌సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో టికెట్ తీసుకోవడానికి క్యూలో నిలబడి ఉన్న పరిస్థితుల్లో చేతిలో ఉన్న పెద్ద బ్యాగులో ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురైంది.

చోరీకి గురైన చిన్న బ్యాగులో కొంత నగదు , కార్డులు ,మొబైల్ స్మార్ట్ ఫోన్ కూడా ఉన్నది. బాధితుడు కొత్తగూడెం లోని స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో చోరీకి గురైన విషయాన్ని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. 3 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టిన అనంతరం నల్లగొండలో మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉన్నట్లు గుర్తించారు.

నల్గొండ నుంచి మొబైల్ ఫోన్ తెప్పించి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బంది బాధితుడు చంద్రగిరి నాగేశ్వరరావుకు మొబైల్ ఫోన్ అందజేశారు. దీంతో బాధితుడు నాలుగు నెలల క్రితం పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి ఈ రోజు ఇప్పించినందుకు పోలీసులకు, సిబ్బందికి కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story