Kothagudem: విజయ విఘ్నేశ్వరాలయంలో మాస శివరాత్రి పూజలు!
Kothagudem: కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్ర పూజలు. రుద్ర హోమం, అన్నాభిషేకం నిర్వహించినట్లు ఈఓ రజిని కుమారి వెల్లడి.
Kothagudem: విజయ విఘ్నేశ్వరాలయంలో మాస శివరాత్రి పూజలు!
Kothagudem: మాస శివరాత్రి మరియు ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చే రోజు పరమశివుడి ఆరాధనకు అత్యంత విశిష్టమైన నేపథ్యంలో..
ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం కావడంతో సోమవారం .. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రంతో కూడిన మహా పర్వదినం సందర్భంగా ..శ్రీదుర్గా మల్లికార్జున స్వామి వారికి ఉదయం ఏడు గంటల నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు..
నేడు ఆలయంలో నిర్వహించిన విశిష్ట పూజా కార్యక్రమాల వివరాలను ఆలయ ఈవో రజిని కుమారి తెలియజేశారు.
ఉదయం 9:30కు రుద్ర హోమం, 11:30 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడం జరిగిందని,
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు తెలిపారు.
తదుపరి అర్చక స్వాములు మరియు దేవాలయ సిబ్బంది చేత తీర్థప్రసాదాలు భక్తులకు అందజేయడం జరిగిందన్నారు.
Next Story




