Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్

Kothagudem: కొత్తగూడెం మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ముగింపు. రాష్ట్రస్థాయికి ఎంపికైన నవదీప్, మేఘన, పావని.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 31 Oct 2026 11:04 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో ఘనంగా జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్

కొత్తగూడెం: భారత ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ లో ఘనంగా జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి. అనూష - జిల్లా పంచాయతీ అధికారి, జగన్ మోహన్ రాజు - కళాశాల ప్రిన్సిపాల్, కామేశ్వర్ రావు - ఎన్.ఎస్.ఎస్ జిల్లా కోఆర్డినేటర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ అధికారి ఎం. వెంకట్ రాంబాబు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం యువతలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, దేశాభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో జిల్లాస్థాయి విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యువత తమ ఆలోచనలు, అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరిచేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలుస్తుందని బి. అనూష అన్నారు, యువతలో పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, పౌర బాధ్యతలు, దేశ నిర్మాణంలో యువత పాత్రపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిస్టిక్ యూత్ అధికారి రాంబాబు అన్నారు. ఈ "వన్ నేషన్ - వన్ ఎలక్షన్" అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 58 విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో బి. నవదీప్ రెడ్డి, జి. మేఘన, జి. పావని జిల్లాస్థాయిలో గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎన్నికవ్వడం జరిగింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM