Kothagudem: జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. అక్టోబర్ 31న అర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో 'వన్ నేషన్-వన్ ఎలక్షన్'పై పోటీలు.
Kothagudem: జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ!
కొత్తగూడెం: భారత ప్రభుత్వ యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, మై భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాలు పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం యువతలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, దేశాభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో జిల్లాస్థాయి విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యువత తమ ఆలోచనలు,అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తపరిచేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి వేదికగా నిలుస్తుంది. యువతలో పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, పౌర బాధ్యతలు, దేశ నిర్మాణంలో యువత పాత్రపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తేదీ: 31 అక్టోబర్ 2026. సమయం: 09:30 గంటలకు వేదిక: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నందు "వన్ నేషన్ - వన్ ఎలక్షన్" అనే అంశంపై 3 నిమిషాలు మాట్లాడే సమయం.18 నుండి 25 సంవత్సరాల యువతీ యువకులు పాల్గొనే అవకాశం కలదు.
ఈ కార్యక్రమంలో మై భారత్ జిల్లా యువ అధికారి మద్దుల వెంకట రాంబాబు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు,తదితరులు పాల్గొన్నారు.




