Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం. జూలూరుపాడుకు 'జోడా కబుర్' రథం. ఆదివాసి తొమ్మిది తెగల సాంస్కృతిక ప్రదర్శనలు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 4 Aug 2026 6:00 PM IST
Kothagudem
X

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం: ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం కార్యక్రమం సందర్భంగా ఆదివాసి 9 తేగలా సాంస్కృతిక( జేఏసీ) కమిటీ రాష్ట్ర అధ్యక్షులు చుంచు రామకృష్ణ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో జరగబోయే ప్రపంచ ఆదివాసి దినోత్సవం కార్యక్రమానికి "జోడా కబుర్ " ని జూలూరుపాడు మండలానికి తీసుకొని రావడం జరిగింది.

ఈ కార్యక్రమానికి కొమ్ము కోయ బృందం, గుసాటి బృందం, ఖాళీ కోయి తుడుం బృందం, నాయక పోడ్ లక్ష్మీ దేవర బృందం, కొండ రెడ్డి డోలు బృందం, ఆర్తి కళాకారుల బృందం, మెస్రం రేలా రవి దెంసా బృందం, మడవి ఇస్రు రేలా బృందం, ఆదివాసి రేలా పాటలకు డిజె సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చుంచు రామకృష్ణ గారు తెలియజేశారు.

జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి ప్రతి ఒక్క ఆదివాసి రావాలని జూలూరుపాడు కొమరం భీమ్ ఫౌండేషన్ కోరుకుంటుంది ఈ కార్యక్రమంలో ఆదివాసి 9 సాంస్కృతిక కమిటీ అధ్యక్షులు చుంచు రామకృష్ణగారు కాలం నరసింహారావు గారు ఇర్ఫా రామారావు గారు పూనం సూరయ్య గారు బచ్చల అశోక్ గారు మడకం వీరభద్రం గారు కొడెం సీత కుమార్ గారు సిద్దబోయిన రామ్మూర్తి గారు పాల్గొన్నారు

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story