Krishna Sagar: గురుకులంలో ఈవీఎంలతో ఎన్నికలు!

Krishna Sagar: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృష్ణసాగర్ గిరిజన గురుకుల కళాశాలలో ఈవీఎంల ద్వారా విద్యార్థి సంఘం ఎన్నికలు.

RAVI, BURGAMPAD AREA
Published on: 17 July 2026 1:24 PM IST
Krishna Sagar
X

Krishna Sagar: గురుకులంలో ఈవీఎంలతో ఎన్నికలు!

Krishna Sagar: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ గ్రామంలో తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ఉన్న జూనియర్ కళాశాల బాలుర విద్యార్థి సంఘం ఎన్నికలను ఈవీఎంల ద్వారా పారదర్శకంగా నిర్వహించారు

ప్రిన్సిపల్ ఎం దేవదాస్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు పరిచయం చేస్తూ ఆధునిక సాంకేతికను వినియోగించడం విశేషంగా నిలిచింది

ఈ ఎన్నికలు కళాశాల ప్యూపిల్ లీడర్, సిపిఎల్ లీడర్,అసిస్టెంట్, సిపిఎల్,ఫుడ్ లీడర్, గేమ్స్ లీడర్ కల్చరల్ లీడర్, ఎలక్ట్రికల్, క్లీన్ అండ్ గ్రీన్ లీడర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవులకు విద్యార్థుల మధ్య పోటీ నెలకొంది ఎన్నికల్లో పోటీ చేసే విద్యార్థులు క్రమశిక్షణ హాజర్ వంటి అర్హతలు కలిగి ఉండాలని ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా సాగాలని కళాశాల యాజమాన్యం ముందుగానే నిబంధనలు జారీ చేసింది.

నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగింది పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేసి ఈవీఎం యంత్రాల ద్వారా విద్యార్థుల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

పోలింగ్ ముందు విద్యార్థులు వివరాలను ధృవీకరించి వేలికి మసి గుర్తు వేసి ఓటుకు అనుమతించారు అభ్యర్థుల ఏజెంట్లు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలింగ్ ముగిసిన వెంటనే రోజు ఫలితాలను ప్రకటించారు ఎన్నికల ప్రక్రియకు చైర్మన్గా ప్రిన్సిపాల్ దేవదాసు కన్వీనర్ గా వైస్ ప్రిన్సిపల్ ప్రధాన పోలింగ్ అధికారిగా ఎం విజయభాస్కర్ పోలింగ్ అధికారులకు డి రతన్ సింగ్ డి ఈశ్వర్ చారి రమేష్ బాధితులు నిర్వహించారు

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా క్రమశిక్షణతో జరిగాయని తెలిపారు ద్వారా విద్యార్థులతో ప్రజాస్వామ్యం అవగాహన నాయకత్వ లక్షణాలు బాధ్యత ఐతమైన ఓటుకు చైతన్యం పెంపొందుతుందని పేర్కొన్నారు ఎన్నికలను విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు సిబ్బంది కి అభ్యర్థులు విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA

Next Story