Kothagudem: సుజాతనగర్‌లో ఆర్భాటాలు లేకుండా కేటీఆర్ జన్మదిన వేడుకలు!
Kothagudem: సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
Kothagudem: సుజాతనగర్‌లో ఆర్భాటాలు లేకుండా కేటీఆర్ జన్మదిన వేడుకలు!
Kothagudem: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్ )గారి పుట్టినరోజు పురస్కరించుకొని.. ఈరోజు సుజాతనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న పెషేంట్లకి పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేసిన సుజాతనగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దేశంలోని విద్యార్థుల పైన జరిగే దాడులను వ్యతిరేకించాలని, విద్యార్థులకు మద్దతుగా నిలవాలి, పుట్టినరోజు వేడుకలు మానుకోవాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారన్నారు.
ఇటువంటి తరుణంలో కేటీఆర్ గారి 50వ పుట్టినరోజు వేడుకలు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిర్వహించినట్ల తెలిపారు.
కేటీఆర్ దేశం లోని నిరుద్యోగులు, మరియు విద్యార్థుల పైన కేంద్ర ప్రభుత్వం చేసే అన్యాయపు దాడులకు నిరసన తెలియచేస్తూ విద్యార్థిని, విద్యార్థులకి పూర్తి మద్దతునివ్వాలని కోరారని,ఇది ఒక గొప్ప నాయకుడికి ఉండే లక్షణమని కొనియాడారు.
నాయకుడు అంటే కేవలం అజమాయిషి చెలాయించడం,పరిపాలించడమే కాదని ఆపద వచ్చిన రోజు ప్రజల పక్షాన నేనున్నానంటూ చేయిఅందించడమని, అటువంటి గొప్ప లక్షణం కలిగి ఉన్న లీడర్ కేటీఆర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సుజాతనగర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లావుడియా సత్యనారాయణ, చింతలపూడి జగన్, పెద్ద మల్ల నరేందర్, కార్తీక్, కృష్ణ, చంటి, ప్రదీప్, బాబా, రహీం, సాజిద్, రాజేష్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.




