Penuballi: బోన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ కొండంత అభయం!
Penuballi: బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడు మణికంఠకు కేటీఆర్ అభయం.. వైద్య ఖర్చులు భరిస్తామని, త్వరలోనే పరామర్శిస్తానని భరోసా.
Penuballi: బోన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ కొండంత అభయం!
Penuballi: ఆ గొంతులో భయం ఉంది బాధ ఉంది అయినా ఒక చిన్న ఆశ ఉంది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచందర్రావుబంజర్. ఆ గ్రామంలో ఓ ఇంట్లో ఇప్పుడు విషాదం అలుముకునేలా ఉంది. ఆ ఇంటి కొడుకు బోన్ క్యాన్సర్ (బోన్ మ్యారో) తో ఎముకలు కొరికే బాధతో నరకయాతన అనుభవిస్తున్నాడు.
చేతిలో చిల్లిగవ్వ లేదు అయినా హైదరాబాద్లో ఎంఎనీ కార్పోరేట్ ఆసుపత్రిలో లక్షలు ఖర్చుచేసి ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రుల కళ్లలో చివరకు కన్నీరే మిగిలింది. కన్న కొడుకిని 20 రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చి అపురూపంగా చూసుకుంటున్నారు. చివరకు ఆ కుటుంబం కన్న కొడుకు కోసం పడుతున్న ఆవేదన స్థానిక నాయకుల ద్వారా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దృష్టికి వెళ్లింది.
అంతే మనస్సున్న నాయకుడు సండ్ర వెంకటవీరయ్య తక్షణం రామచందర్రావుబంజర్లోని బోన్ క్యాన్సర్ బాధిత యువకుడు బన్నె మణికంఠ యాదవ్ ఇంటికి చేరుకున్నారు. బాధను విన్నారు తక్షణమే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు యువకుడి పరిస్థితిని వివరించి వీడియోకాల్ చేశారు.
యువకుడితో కేటీఆర్ వీడియోకాల్ సంభాషణ
బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి కేటీఆర్ వీడియోకాల్లో కొండంత భరోసా కల్పించారు. తమ్మి ధైర్యంగా ఉండు. ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నావు... నీకు ఎంత ఖర్చయినా పార్టీ నుంచి బరాయిస్తాం ధైర్యంగా ఉండు నీకు, కుటుంబానికి అటు వీరన్న ఇటు నేను అండగా ఉంటాం. ఏం కావాలో చెప్పు, భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండాలి అంతే అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. నీకు ఏమైనా కావాలా, అని అడగ్గా సర్ నేను మిమ్మల్ని ఒక్కసారి చూడాలి.
నేరుగా మీతో మాట్లాడాలి అన్న మాటకు తప్పకుండా తమ్మీ త్వరలోనే మీ ఇంటికి వస్తాను. అప్పటివరకు ధైర్యంగా ఉండాలి అంటూ మణికంఠ యాదవ్ కు భరోసా ఇచ్చారు. భావోద్వేగానికి గురైన మణికంఠ చెమర్చిన కళ్లతో సంతోషం వ్యక్తం చేశాడు.




