Kothagudem: ఢిల్లీ నీట్ లాఠీఛార్జ్‌పై భగ్గుమన్న కొత్తగూడెం లాయర్లు!

Kothagudem: జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో నీట్ విద్యార్థులపై పోలీస్ లాఠీఛార్జ్ కి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 23 July 2026 5:25 PM IST
Kothagudem
X

Kothagudem: ఢిల్లీ నీట్ లాఠీఛార్జ్‌పై భగ్గుమన్న కొత్తగూడెం లాయర్లు!

కొత్తగూడెం: న్యాయవాదుల సంఘ కార్యాలయంలో సంఘం అద్యక్షుడు కిరణ్ కుమార్ అద్యక్షతన సర్వసభ్యసమావేశం నిర్వహించారు..

ఈ సమావేశంలో సభ్యులు ముక్తకంఠంతో పోలీసుల చర్యను ఖండిస్తూ నల్ల బ్యాడ్జిలతో జిల్లా కోర్టు నుండి ర్యాలీగా వెళ్లి పోస్టాఫీసు సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపాలని సమావేశంలో తీర్మనించారు.

అనంతరం న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కోర్టు నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలియజేసారు.ఈ సమావేశంలో జిల్లా న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి మహేష్ గడి పెల్లి... మాట్లాడుతు ఢిల్లీలో నీట్ విద్యార్థులపై పోలీస్ చర్యను ఖండిచారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ దారుణమన్నారు.

కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో, ILU, IAL, ILPA సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story