Burgampad: రేగా కాంతారావు పిలుపు.. సారపాక బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన!
Burgampad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి.
Burgampad: రేగా కాంతారావు పిలుపు.. సారపాక బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన!
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన సెంటర్‌లో ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, టౌన్ అధ్యక్షుడు కొనకంచి శ్రీను ఆధ్వర్యంలో సారపాక ప్రధాన కూడలిలో నినాదాలతో ఆందోళన నిర్వహించారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Next Story




