Singareni: బొగ్గు రవాణా వివాదం.. ఇల్లందు సింగరేణి ఏరియాలో ఉద్రిక్తత
Singareni: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఓసీ గని వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Singareni: బొగ్గు రవాణా వివాదం.. ఇల్లందు సింగరేణి ఏరియాలో ఉద్రిక్తత
Singareni: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని.. బొగ్గు రవాణా కు సంబంధించి శనివారం వివాదం చోటుచేసుకుంది. కోయగూడెం OC లో జరుగుతున్న బొగ్గు రవాణా లో 14 టైర్ల టిప్పర్ వాహనాలకు అవకాశం ఇవ్వడం లేదని, OC కాంట్రాక్టర్ కు చెందిన భారీ వాహనానికే అవకాశం ఇస్తున్నారని ఒక టిప్పర్ లారీ యజమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈక్రమంలో అక్కడే ఉన్న టేకులపల్లి పోలీస్ ఎస్సై పురుగుల మందు తాగుతున్న లారీ యజమానినీ అడ్డుకోబోతుండగా మందు ఎసై కళ్ళలో పడడంతో స్వల్పంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది.
కోయగూడెం ఉపరితల గని నుంచి బొగ్గు రవాణాకు సంబంధించి టిప్పర్ ఓనర్ అసోసియేషన్ కి గుత్తేదారుకు మధ్య బొగ్గు రవాణాకు సంబంధించి ఒప్పందం మేరకు బొగ్గు రవాణా జరుగుతుంది. అసోసియేషన్ లో ఉన్న ఓనర్లకు 14 టైర్ల టిప్పర్లు ఉండగా గుత్తేదారు 16 టైర్ల భారీ వాహనంతో బొగ్గు రవాణా చేస్తుండడంతో తమకు సరిగా బొగ్గు రవాణాకు అవకాశాలు ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని టిప్పర్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై అసోసియేషన్ కార్యాలయ సమీపంలో టెంట్ వేసుకొని సమావేశం అయిన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టేకులపల్లి ఎస్సై రాజేందర్ వాళ్లతో మాట్లాడుతున్న సందర్భంలో టిప్పర్ యజమాని రవి చేతిలో ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా ఉండడంతో లాక్కునేందుకు ప్రయత్నించగా రవి పై ఎస్సై కళ్ళల్లో ఆ మందు పడింది. తమ వాహనాలు నడవకపోవడంతో కిస్తీలు కట్టుకోవడం భారకం మారిందని టిప్పర్ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు




