Burgampahad: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అందజేత!

Burgampahad: బూర్గంపాడు మండలంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ సాంకేతికతతో గుర్తించి బాధితుడికి అందజేసిన పోలీసులు. ఎస్సై మేడ ప్రసాద్ వివరణ.

RAVI, BURGAMPAD AREA
Published on: 19 Oct 2026 7:04 AM IST
Burgampahad
X

Burgampahad: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అందజేత!

Burgampahad: మండలంలోని మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన మనోజ్‌ గత నెలలో పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ను బూర్గంపాడు పోలీసులు గుర్తించి ఆదివారం బాధితుడికి అందజేశారు. ఎస్సై మేడ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం మనోజ్‌ ఫోన్‌ పోగొట్టుకున్నట్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మొబైల్‌ ట్రాకింగ్‌ సాంకేతికత సాయంతో పోలీసులు దాని ఆచూకీని గుర్తించారు.

కరకగూడెంలో ఉన్న ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు. ఫోన్‌ను తిరిగి అందజేసిన ఎస్సైతోపాటు పోలీసు సిబ్బందికి మనోజ్‌ కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నవారు వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA