Khammam: రాజ్యాంగ దినోత్సవ సదస్సును జయప్రదం చేయండి: కొరిపల్లి!

Khammam: నవంబర్ 26న ఖమ్మం ఐఎంఏ హాల్లో నిర్వహించే భారత రాజ్యాంగ దినోత్సవ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Nov 2026 9:32 PM IST
Khammam
X

Khammam: రాజ్యాంగ దినోత్సవ సదస్సును జయప్రదం చేయండి: కొరిపల్లి!

ఖమ్మం: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం రూపుదిద్దుకోవడానికి కారణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని, ఎన్ని ప్రభుత్వాలు మారిన పూర్తిస్థాయిలో రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు, దళితరత్న, డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ... 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలుపరిచేందుకు, రాజ్యాంగ హక్కులు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను, భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారిపై దేశద్రోహం కింద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 26న ఖమ్మం నగరంలోని ఐఎంఏ హాల్లో "భారత రాజ్యాంగ దినోత్సవ జిల్లా సదస్సును" ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్టిఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్, సంఘం వ్యవస్థాపకులు జన్ను కనకరాజు మాదిగ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి మేధావులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దుప్పెల్లి శ్రీను మాదిగ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మునగలేటి వీరస్వామి మాదిగ, ఖమ్మం నియోజకవర్గం ఇంచార్జి పిల్లిగుండ్ల ముత్తయ్య మాదిగ, పాలేరు నియోజకవర్గ ఇంచార్జి బొడ్డు గురువయ్య మాదిగ, ఖమ్మం కార్పొరేషన్ ఇంచార్జి రాయల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ కో-ఇంచార్జి కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్