Manuguru: నవంబర్ 29న మణుగూరులో దీక్షా దివస్‌ను భారీ ఎత్తున విజయవంతం చేద్దాం!
Manuguru: నవంబర్ 29న మణుగూరు గుట్టు మల్లారం మెయిన్ రోడ్డు గ్రౌండ్‌లో నిర్వహించే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఉద్యమకారులు గురువారం పిలుపునిచ్చారు.
Manuguru: నవంబర్ 29న మణుగూరులో దీక్షా దివస్‌ను భారీ ఎత్తున విజయవంతం చేద్దాం!
మణుగూరు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాది ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమర నిరాహార దీక్ష చేపట్టిన మహానేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2009 నవంబర్ 29న చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం.
"కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో" అనే నినాదంతో సాగిన ఆ మహా పోరాటం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించింది. కేసీఆర్ గారి దీక్షా సంకల్పం, త్యాగం, పోరాట పటిమతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కీలక మలుపు తిరిగింది. ఆ చారిత్రాత్మక రోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహించుకుంటున్నాం.
ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు నవంబర్ 29న మణుగూరులో దీక్షా దివస్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. ఆనాడు కేసీఆర్ గారు చేపట్టిన అమర నిరాహార దీక్షను, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని విమర్శించారు. మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉందని, ఉద్యమ స్ఫూర్తితో మరోసారి ఉద్యమకారులంతా ఏకమై ప్రజా సమస్యలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
కావున పినపాక నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నవంబర్ 29న మణుగూరులో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటుదాం.. ఉద్యమకారుల ఐక్యతను చాటుదాం.. మనం సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం!
ఈరోజు మణుగూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఉద్యమకారులు:
1. ఎడ్ల శ్రీనివాస్ – మాజీ మండల అధ్యక్షులు
2. వాంకుడోత్ భాస్కర్
3. బొజ్జ సతీష్ చారి
4. కమటం రవీంద్రబాబు
5. కోనేటి సత్యనారాయణ
6. నర్సింగ్ నారాయణరావు
7. తురక రామకోటి
8. స్త్రీల కంటి జనార్ధన్
9. లాల్ మహమ్మద్
జై తెలంగాణ
జై కేసీఆర్
జై కేటీఆర్
జై హరీష్ అన్న
జై జై రేగా కాంతారావు అన్న
నవంబర్ 29 – దీక్షా దివస్
మణుగూరు – పినపాక నియోజకవర్గం
ఉద్యమకారుల ఐక్యతే మన బలం.. తెలంగాణ ఆత్మగౌరవమే మన లక్ష్యం!
స్థలం మణుగూరు గుట్టు మల్లారం మెయిన్ రోడ్డు పక్కన గ్రౌండ్.




