Sathupally: సత్తుపల్లిలో ‘మన ఓటు మన గొంతుక’ సదస్సు
Sathupally: శాసనమండలిలో ఉద్యమకారుల గొంతు వినిపించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామని సత్తుపల్లి ‘మన ఓటు మన గొంతుక’ సదస్సులో TUF నేతలు ప్రకటించారు.
Sathupally: సత్తుపల్లిలో ‘మన ఓటు మన గొంతుక’ సదస్సు
సత్తుపల్లి: శాసన మండలిలో ఉద్యమకారుల గొంతు వినిపించడం కోసం, ఉద్యమకారుల ప్రాతినిధ్యం కోసం గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టి యు ఎప్ ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎల్ ఎస్ రెడ్డి ఆదేశానుసారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు గుంట్రు రామకృష్ణా రావు, కార్యదర్శి కిన్నెర వెంకటేశ్వర రావు అధ్యక్షతన మన ఓటు మన గొంతుక కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గ లోని అన్ని మండలాల తెలంగాణ ఉద్యమకారులు ఫోరం (టీ యు ఎప్) ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ రింగ్ సెంటర్లో తెలంగాణ ఉద్యమకారుల అమరవీరుల స్తూపం దగ్గర మన ఓటు మన గొంతుక పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం మనం అనేక పోరాటాలు చేయటం జరిగింది.
ఆ ఉద్యమంలో మనము ఆర్థికంగా,రాజకీయంగా వెనుకబడిపోయినాము మన పోరాటాల వలన రాజకీయ నాయకులు పదవులు పొంది రాష్ట్రాన్ని పాలించారు కానీ, రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను పట్టించుకోలేదు, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పదవిలోకి రాకముందు ఉద్యమకారులను గుర్తిస్తామని వారికి రాజకీయం గా ఆర్థికంగా అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చి మూడు సంవత్సరాలు అయినా కంటి తుడుపు చర్యగా కమిటీ వేసాము అని కాలయాపన చేస్తూ మళ్లీ మన ఓటులతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు.
కావున ఉద్యమకారులు మేలుకొని మేధావులను కలుపుకొని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారుల తరఫున మన నాయకుడిని నిలబెట్టుకొని మన గొంతుకను చట్టసభల్లో వినిపించి ఉద్యమకారులకు న్యాయం చేసుకుందామని అన్నారు. కావున రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారుల తరఫున పోటీ చేసే అభ్యర్థిని గెలిపించుకోవాలని అందుకు ప్రతి ఒక్క ఉద్యమకారుడు మరో ఉద్యమం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ అన్ని మండలాల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పాల్గొన్నారు.




