Burgampahad: బూర్గంపహడ్ లో ఎంపిడిఓ క్షేత్రస్థాయి పర్యటన
Burgampahad: బూర్గంపహడ్ మండలంలో ఉపాధి హామీ కూలీలకు ఈ-కేవైసీ ప్రక్రియను ఎంపిడిఓ జమలారెడ్డి ప్రారంభించారు.
Burgampahad: బూర్గంపహడ్ లో ఎంపిడిఓ క్షేత్రస్థాయి పర్యటన
బూర్గంపహడ్: బూర్గంపహడ్ మండలంలో జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు ఈ-కేవైసీ చేయించుకోవాలి అని, లేని పక్షంలో జాబ్ కార్డులో పేరు తొలగిపోతుంది అని బూర్గంపహాడ్ ఎంపిడిఓ జమలారెడ్డి గ్రామాల్లో తిరుగుతూ...ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం ఉదయం బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీలో స్వయంగా ఉపాధికూలీలకు ఎంపిడిఓ జమలారెడ్డి ఈ-కేవైసీ చేశారు.
జాబ్ కార్డు ఉన్న వ్యక్తి మాత్రమే పనులకు వచ్చేలా చూడటానికి, ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఈ-కేవైసీ సేకరిస్తున్నాము అని,ఉపాధి హామీ కూలీలు తమ సమీప గ్రామ పంచాయతీ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి అని కోరారు. దీని కోసం ముఖ గుర్తింపు (Facial Recognition) యాప్ ఉపయోగిస్తున్నట్టు
కొత్త నిబంధన ప్రకారం: ఈ-కేవైసీ లేని కూలీలకు పనులు చేసినా వేతనాలు రాకపోవచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇ-కేవైసీ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మందా నాగరాజు, ఉపాధిహామీ TA లు, మేట్లు, స్థానిక గ్రామ ప్రజలు ఉన్నారు.




