Manuguru: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ అఖిలపక్షం నిరసన
Manuguru: మణుగూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ అవకతవకలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్.
Manuguru: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ అఖిలపక్షం నిరసన
మణుగూరు: రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కొనసాగుతున్న SIR ప్రక్రియలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలను నిరసిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మణుగూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
AICC, ఇండియా కూటమి, ఆదేశాలమేరకు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి పిలుపుతో మణుగూరు మండల, పట్టణ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంల్ మాస్ లైన్ పార్టీ నాయకులు, అఖిలపక్షంగా ఏర్పడి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
మణుగూరు సెంటర్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగుతూ అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ అఖిలపక్ష పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
SIR ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి ఓటరుకు చెందిన ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగించేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని, ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా, ప్రతి పౌరుడికి తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని, రాజ్యాంగ హక్కులు మరియు ఓటు హక్కు పరిరక్షణకు నిరంతరం పోరాడాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమం లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, పట్టణ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్, సిపిఐ డివిజన్ సెక్రటరీ సరెడ్డి పుల్లారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దొబ్బల వెంకటప్పయ్య, సిపిఐ మండల సెక్రెటరీ జక్కుల రాజబాబు, సిపిఎం మండల సెక్రెటరీ సత్రపల్లి సాంబశివరావు, సిపిఐ టౌన్ సెక్రటరి దుర్గ్యాల సుధాకర్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు బోనగిరి శివసైదులు, సారపు రాంరెడ్డి, సిపిఐ జిల్లా సమైక్య అధ్యక్షులు మున్నా లక్ష్మి కుమారి,మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కూరపాటి సౌజన్య, మైనార్టీ అధ్యక్షులు ఎండి రహీమ్ పాషా, సర్పంచ్ లు పాల్వంచ రాములు, కారం పూజిత, ఉపసర్పంచ్ లు గాండ్ల సురేష్, కనకయ్య,మణుగూరు మండల, పట్టణ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంల్ మాస్ లైన్ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, INTUC ప్రతినిధులు, లారీ యూనియన్ నాయకులు, బొగ్గు ముఠా కార్మికులు, గుమాస్తాల సంఘం ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, అఖిలపక్ష నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఓటు హక్కును కాపాడేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు




