Manuguru: నేరాల కట్టడి కోసమే కార్డన్‌ సెర్చ్‌ మణుగూరు డిఎస్పి వంగా రవీందర్ రెడ్డి

Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 15 May 2026 10:46 AM IST
Manuguru
X

Manuguru: నేరాల కట్టడి కోసమే కార్డన్‌ సెర్చ్‌ మణుగూరు డిఎస్పి వంగా రవీందర్ రెడ్డి

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో మణుగూరు డిఎస్పి ఆధ్వర్యంలో డివిజన్లోని నాలుగు మండలాల సిఐలు ,ఎస్ఐల తోపాటు 50 మంది పోలీస్ సిబ్బందితో కార్డునెంట్ సెర్చ్ నిర్వహించారు. నెంబర్‌ ప్లేట్లు, సరైన సర్టిఫికెట్లు లేని 80 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను పోలీసులు గుర్తించి వాహనదారులకు ఫైన్లు వేసారు, మూడు దుకాణాల్లో అక్రమంగా నిలువుంచిన సుమారు 80 వేల రూపాయల విలువగల మద్యం బాటిల్లను సీజ్ చేసారు.

పోలీసులు . డి.ఎ.స్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.... కార్డన్‌ సెర్చ్‌ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, ప్రయాణించే సమయంలో వాహనాల అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు, సైబర్ క్రైమ్ మోసాల పట్ల ప్రజలకు వివరించారు. చట్టవిరుద్ధ కార్యకలపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA

Next Story