Manuguru: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

Manuguru: మణుగూరు గుట్టమల్లారం రైతు వేదికలో రైతు నేస్తం వీసీలో సాగునీటి కొరత నేపథ్యంలో యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలని, రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 28 Nov 2026 11:47 PM IST
Manuguru
X

Manuguru: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

మణుగూరు: మణుగూరు మండలం గుట్టమల్లారం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగిలో సాగునీటి కొరత దృష్ట్యా వరికి బదులుగా పెసర, మినుము, జొన్న, కంది, నువ్వులు, వేరుశనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.

పంటల సాగు విధానాలు, విత్తన ఎంపిక, ఎరువుల యాజమాన్యం, సోలార్ ఫెన్సింగ్, ఫామ్ పాండ్స్ నిర్మాణం, వ్యవసాయ యంత్రాల సబ్సిడీపై అవగాహన కల్పించారు.

అలాగే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పంట రుణాలు పొందిన రైతులు సంబంధిత బ్యాంకులను సంప్రదించి రుణాల రీషెడ్యూల్ చేయించుకోవాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏడీఏ బి. తాతారావు, ఏఓ రాహుల్ రెడ్డి, ఏఈఓ డా. కె. లక్ష్మణరావు, బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA