Manuguru: గ్రంథాలయాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

Manuguru: మణుగూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన గ్రంథాలయం, స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 12 Nov 2026 6:36 PM IST
Manuguru
X

Manuguru: గ్రంథాలయాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , మణుగూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, స్కౌట్స్ అండ్ గైడ్స్ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA