Manuguru: కూరగాయల మార్కెట్‌లో గణేష్ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
Manuguru: మణుగూరు కూరగాయల మార్కెట్‌లో గణపతి నవరాత్రి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ శ్రేణులు.
Manuguru: కూరగాయల మార్కెట్‌లో గణేష్ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం
మణుగూరు: మణుగూరు మండల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతి స్వామివారిని దర్శించుకుని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో వ్యాపారులు, ప్రజలందరూ అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




