Manuguru: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి: సీఐటీయూ!
Manuguru: మణుగూరు మున్సిపాలిటీ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు గళమెత్తారు.
Manuguru: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి: సీఐటీయూ!
మణుగూరు: సిఐటియు మణుగూరు మండల నాయకత్వం ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ చేయాలని citu జిల్లా కమిటీ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు ఏండ్ల తరబడి మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల కార్మికుల కుటుంబాల పట్ల మొండిగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ చేయాలని అందుకు జరిగే హైదరాబాదులో జరిగే 26వ తారీకు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
మణుగూరు మున్సిపాలిటీలో సుమారు లక్షల 50 మంది జనాభా ఉండగా 30 మంది కార్మికులతో పని భారం పెరిగి అలసట చెంది తెల్లవారి జామున రెండో రోజు పనికొచ్చే పరిస్థితి లేదని కార్మికుల ఆవేదన చెందుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని. వృద్ధాప్యంలో రిటైర్డ్ అయిన వాళ్ళ ప్లేస్ లో వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలని మరణించిన వారి ఫేస్ లో కూడా కుటుంబ సభ్యులు తీసుకోవాలని వారన్నారు citu మండల కార్యదర్శి కొడిశాల రాములు. పల్లపు నాగేశ్వరరావు. నరసింహారావు దుర్గయ్య. రావులపల్లి వెంకటేశ్వర్లు హరీష్ తదితరులు పాల్గొన్నారు.




